Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఏయ్‌ పన్నీర్‌’ అని పిలవగానే చిత్తం చిన్నమ్మా అంటాననుకున్నావా? సెల్వం... పన్నీర్‌ సెల్వం!

తమిళనాడు ప్రజల ముందుకు కొత్త కబాలి వచ్చేశాడు. కబాలి డా... అంటూ రజనీకాంత్ ఇటీవలే కబాలి సినిమాలో పంచ్ డైలాగుతో జనాల్ని అదరగొట్టినట్లుగా ఇప్పుడు మరో కబాలి రంగంలోకి దిగాడు. పిలవగానే వచ్చి జీ హుజార్ అనడానికి నీ ఇంటి పాలేరుననుకున్నావా చిన్నమ్మా.. సెల్వం, ప

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (04:04 IST)
తమిళనాడు ప్రజల ముందుకు కొత్త కబాలి వచ్చేశాడు. కబాలి డా... అంటూ రజనీకాంత్ ఇటీవలే కబాలి సినిమాలో పంచ్ డైలాగుతో జనాల్ని అదరగొట్టినట్లుగా ఇప్పుడు మరో కబాలి రంగంలోకి దిగాడు. పిలవగానే వచ్చి జీ హుజార్ అనడానికి నీ ఇంటి పాలేరుననుకున్నావా చిన్నమ్మా.. సెల్వం, పన్నీర్ సెల్వం అంటూ జనాల్ని వెర్రెత్తిస్తున్నాడు. 
 
సోషల్‌ మీడియా ప్రచారంలో భాగంగా కబాలి సినిమాలో రజనీకాంత్‌ పాపులర్‌ డైలాగ్‌  ‘ముఖం మీద గాటుపెట్టుకుని, మీసం తిప్పి, లుంగీకట్టుకుని పాత విలన్‌ ‘ఏయ్‌ కబాలి’ అనగానే ఒంగొని ఎస్‌ బాస్‌ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నార్రా’ అనే డైలాగ్‌ను ‘పాత రోజుల్లోలా నుదుటున బొట్టు పెట్టుకుని పంచె కట్టుకుని ‘ఏయ్‌ పన్నీర్‌’ అని పిలవగానే చిత్తం చిన్నమ్మా అని వినయంగా నిల్చుంటాననుకున్నావా సెల్వం.. పన్నీర్‌ సెల్వం’ అంటూ రజనీకాంత్‌ ఫొటోలో పన్నీర్‌ తల పెట్టి గ్రాఫిక్‌ చేసిన ఫొటో, వీడియో ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో వైరల్‌గా మారింది. 
 
కబాలి సినిమాలో రజనీ డైలాగ్‌ జనాన్ని ఎంత ఆకట్టుకుందో ఇప్పుడు పన్నీర్‌ సెల్వం డైలాగ్‌ కూడా టైమ్లీగా అంతే స్థాయిలో పేలింది. కబాలి వేషంలో పన్నీర్ సెల్వం ఫోటోను చూస్తున్న  జనం వెర్రెత్తిపోతూ చిన్నమ్మను తల్చుకుని పగలబడి నవ్వుకొంటున్నారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments