Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ నన్ను చంపొద్దు.. నేను పాకిస్థాన్ ఉగ్రవాదిని : సజ్జాద్ అహ్మద్

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (13:01 IST)
భారత్ వ్యతిరేక పాకిస్థాన్ ఉగ్రవాదానికి మరో సజీవ సాక్ష్యం దొరికింది. ఇటీవల ఉధంపూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన నవేద్‌ అనే ఉగ్రవాదిని భారత బద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్న విషయంతెల్సిందే. ఇప్పుడు బారాముల్లాలో సజ్జాద్‌ అహ్మద్‌ అనే మరో తీవ్రవాది ప్రాణాలతో పట్టుడ్డాడు. ఇది భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఎగదోస్తున్న ఉగ్రవాదానికి సజీవసాక్ష్యంగా నిలిచింది. 
 
ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపిన ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు ఈనెల 23వ తేదీ అర్థరాత్రి తర్వాత కట్టుదిట్టమైన ‘కంచె’ను దాటేందుకు పలుమార్లు ప్రయత్నించారు. వెంటనే జవాన్లు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులు కంచె దాటి కశ్మీర్‌లోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులు బుధవారం తెల్లవారుజామున యూరి - రఫియాబాద్‌ మధ్య ఖఫీర్‌ఖాన్‌ కొండల నుంచి కిందికి దిగుతున్నట్లుగా గుర్తించారు. 
 
అంతే... ఓ మేజర్ పర్యవేక్షణలో అనేక మంది జవాన్లు ఉగ్రవాదులను వెంబడించారు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని బధవారం మట్టుబెట్టారు. మిగిలిన వారు కాలికి బుద్ధి చెప్పారు. వీరికోసం బుధవారం రాత్రి, గురువారం తెల్లవారాక కూడా గాలింపు కొనసాగింది. ఈ క్రమంలో ఒక గుహ నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు దీటుగా జవాబు చెప్పారు. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికి... లోపలి నుంచి కాల్పులు ఆగిపోయాయి. జవాన్లు గుహలోకి ‘మిర్చీ బాంబు’ (చిల్లీ గ్రెనేడ్‌) ప్రయోగించి, జాగ్రత్తగా గుహలోకి ప్రవేశించారు. అక్కడ... ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయి. మరో ఉగ్రవాది... కళ్లనీళ్లు పెట్టుకుంటూ నేలపై కూర్చుని కనిపించాడు. ‘చంపొద్దు’ అంటూ జవాన్లను వేడుకున్నాడు. 
 
ఈ ఉగ్రవాదిని పట్టుకుని విచారించగా... తన పేరు సజ్జాద్‌ అహ్మద్‌ అని తెలిపాడు. తన ఊరు నైరుతి పాకిస్థాన్‌లోని ముజఫర్‌గఢ్‌ అని చెప్పాడు. వయసు 22 ఏళ్లని, మొత్తం ఐదుగురితో కలిసి కాశ్మీర్‌లోకి చొచ్చుకుని వట్టు తెలిపారు. మరో ఉగ్రవాది సజీవంగా పట్టుబడటంతో పాక్‌ కుట్రలు బట్టబయలయ్యాయని హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments