Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్జిట్ పోల్స్ లోనే కాదు.. గ్రౌండ్ రియాల్టీలోనూ ఎస్పీ-కాంగ్రెస్ ఔటేనా?

కొంతమంది ఒత్తిడివల్ల ముందస్తు అంచనాలు తలకిందులయ్యాయని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ బాబాయ్ రామ్ గోపాల్ చెబుతుంటే మరోవైపు ఎస్పీ బహిష్కృత నేత అమర్ సింగ్ అంత సీన్ లేదని కొట్టిపడేశారు. ఎగ్జిట్ పోల్స్ లోనే కాదు..గ్రౌండ్ రియాల్టీలోనూ ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి పరా

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (04:01 IST)
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా విరుద్ధమైన అంచనాలను తీసుకొస్తున్నాయి. బంపర్ మెజారిటీ మాకంటే మాకని ప్రధాన పార్టీలు చెప్పుకుంటుండటంతో సోమవారం కౌంటింగ్ మొదలైతే కాని ఎగ్జిట్ పోల్స్ బండారం బయటపడేలా లేదు. ఈలోగా రాజకీయ నేతల అంచనాలు కోటలు దాటుతున్నాయి. కొంతమంది ఒత్తిడివల్ల ముందస్తు అంచనాలు తలకిందులయ్యాయని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ బాబాయ్ రామ్ గోపాల్ చెబుతుంటే మరోవైపు ఎస్పీ బహిష్కృత నేత అమర్ సింగ్ అంత సీన్ లేదని కొట్టిపడేశారు. ఎగ్జిట్ పోల్స్ లోనే కాదు..గ్రౌండ్ రియాల్టీలోనూ ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి పరాజయం తప్పదని అమర్ చెప్పేశారు.
 
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్న సంఖ్యలన్నీ తారుమారయ్యాని, ఒరిజినల్ ఎగ్జిట్ పోల్స్ అవి కాదని ఎస్పీ నేత, అఖిలేష్ యాదవ్ బాబాయ్ రామ్ గోపాల్ అన్నారు. యూపీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ 236-140 అసెంబ్లీ స్థానాలు గెలిచి అఖిలేష్ రెండోసారి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్... తప్పని..అవి కొంతమంది ‘ఒత్తిడి’ వల్ల తలకిందులయ్యాయని... అసలు ఎగ్జిట్ పోల్స్ లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని తేలిందని రామ్ గోపాల్ చెప్పారు. అయితే ఆ ఒత్తిడి ఎవరిదో ఆయన చెప్పలేదు. 
 
రామ్ గోపాల్ యాదవ్ ఎగ్జిట్ పోల్స్ పై చేసిన కామెంట్లపై ఎస్పీ బహిష్కృత నేత అమర్ సింగ్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ లోనే కాదు..గ్రౌండ్ రియాల్టీలోనూ ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి పరాజయం తప్పదని అమర్ సింగ్ అన్నారు. 
 
ఎవరి లెక్క కరెక్టో తేలడానికి మరికొద్ది గంటలే టైముంది మరి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments