Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హోటళ్లలో కరెన్సీతో పనిలేదు.. బ్లాక్‌మనీ అడ్డుకట్టకు చర్యలు..!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (10:48 IST)
దేశంలో నల్లధనం నిర్మూలనకు కేంద్ర తీసుకుంటున్న పలు విధాలైన చర్యల్లో భాగంగా వినూత్న రీతిలో కొత్త విధానాలను ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇక మీదట దేశంలో ఉన్న ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో కరెన్సీతో పని లేకుండా చేయనుంది. హోటల్ బిల్లుకైనా, దూర ప్రాంత విమానం టిక్కెట్, లగ్జరీ కార్లు అద్దెకు తీసుకోవాలన్నా, ఖరీదైన విలాస వస్తువులు కొనాలన్నా అన్నిటికీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారానే చెల్లింపులు జరపాలి.
 
హై వాల్యూ లావాదేవీలపై దృష్టిని సారించిన కేంద్రం నల్ల ధనాన్ని అరికట్టేందుకు ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఒక పరిధి దాటిన తరువాత చెల్లింపులన్నీ బ్యాంకు మాధ్యమంగానే జరగాలన్న నిబంధన అమలులోకి రానుంది. బ్లాక్ మనీని ఆపాలంటే నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గాల్సివుందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆర్థిక శాఖకు సిఫార్సులు సమర్పించిన నేపథ్యంలో నగదు లావాదేవీలకు పరిమితి పెట్టాలని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments