Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలంతా జంతువులే.. ఆ ఇద్దరు మాత్రం జంతువేతరులు: రాహుల్

విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ బీజేపీ జాతీయాధ్యక్షుడు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత దేశంలో ఉన్న ప్రజలంతా జంతువ

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (14:04 IST)
విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ బీజేపీ జాతీయాధ్యక్షుడు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత దేశంలో ఉన్న ప్రజలంతా జంతువులేనని.. కేవలం రెండే రెండు జంతువేతరులున్నారని.. వారెవరో తెలుసా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలని ఎద్దేవా చేశారు. 
 
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌ పరిసరాల్లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ.. ఓ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలను దెప్పిపొడిచారు. తదుపరి ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఉండదని అర్థం చేసుకున్న మోదీ, మానసికంగా కుంగిపోయారని, అందుకే ఇలాంటి అగౌరవ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 
 
దేశంలోని దళితులు, మైనారిటీలు సహా తమ పార్టీ నేతలను కూడా వారు పనికిరాని వారుగా చూస్తున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు. ఆర్థికంగా దేశాన్ని సర్వనాశనం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, బ్యాంకుల కుంభకోణాలు పెరిగిపోయానని, నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments