Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంద్రాలో భవనం కూలింది.. 11మంది మృతి.. అదెలా కూలింది..?

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (14:43 IST)
Mumbai
ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఖేర్వాడి రోడ్‌లోని ఓ భవనం అర్ధరాత్రి కుప్పకూలింది. దీంతో 11మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయని బీఎంసీ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని రక్షించినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
 
కాగా.. సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే జీషన్‌ సిద్ధిఖి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో బిల్డింగ్‌ కూలిపోయిందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది బాధితులను కాపాడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. 
 
ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డింగ్ ఏలా కూలిందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. దీంతోపాటు టౌన్ ప్లానింగ్, ఇంజనీర్ అధికారులు కూడా పరీశీలిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments