Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాపై వర్మ ట్వీట్: మీ సినిమాలన్నీ హిట్టేనంటూ ఒమర్ కౌంటర్ ట్వీట్!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (16:17 IST)
భారత జట్టు ఓటమి పైన సంచలన వ్యాఖ్య చేసిన రాంగోపాల్ వర్మకు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా గట్టి కౌంటర్ ఇచ్చారు. అన్ని సమయాల్లో రాము సినిమాలు అలాగే బ్లాక్ బస్టర్ అవుతాయి కదా అని ఎద్దేవా చేశారు. మీ సినిమాలు ప్రతి సమయంలోను మంచి హిట్లవుతాయి.. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని సెటైర్ వేశారు. 
 
ట్విట్టర్‌లో వివాదాస్పద కామెంట్స్‌ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించే డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ఈసారి క్రికెట్‌పై తన బాణాలు ఎక్కుపెట్టాడు. క్రికెట్‌ను విపరీతంగా ద్వేషించే రాంగోపాల్ వర్మ.. భారత్‌ ఓటమి నాకు చాలా ఆనందం కలిగించిందని, ఎందుకంటే నాకు క్రికెట్‌ అంటే ఇష్టముండదని, క్రికెట్‌ను అభిమానించేవారంటే అస్సలు ఇష్టం ఉండదని ట్వీట్‌ చేశాడు. 
 
దీనిపై ఒమర్ అబ్దుల్ తనదైనశైలిలో శుక్రవారం ట్వీట్ చేశారు. 'అన్ని వేళలా నీ సినిమాలు కూడా అలాగే బ్లాక్ బ్లస్టర్ అవుతాయి కదా' అంటూ వ్యంగ్య ట్వీట్ వదిలారు. ఆయన 'No wonder your movies are such block buster hits all the time' అని ట్వీట్ చేశారు. ప్రపంచ కప్ పోరులో భారత జట్టు బాగా ఆడిందని మెచ్చుకున్నారు. ఓటమిపై అతివాద చర్యలకు పాల్పడుతున్న వారిని అభిమానులు అనడం సరికాదని అభిప్రాయపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments