Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు తాగొద్దన్నాడనీ యజమానిని హత్య చేసిన సర్వెంట్

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (16:50 IST)
మద్యం తాగవద్దని నివారించినందుకు యజమానిని గొడ్డలితో నరికి చంపిన ఘటన మంగళవారం రాత్రి ఒడిశాలో జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఖుర్దా జిల్లా సిమోరొ గ్రామానికి చెందిన 35 ఏళ్ల సత్యబ్రత అనే యువకుడు ఊళ్లో కొత్త ఇల్లు కట్టాడు. అతని తల్లిదండ్రులు భువనేశ్వర్‌లోని పాత ఇంట్లో ఉంటున్నారు. మరో 20 రోజులలో పెళ్లి కావలసి ఉండగా, సత్యబ్రత ఇంటికి రంగులు వేయించాలని భావించాడు. 
 
రంగులు కొనుగోలు చేయాలని సత్యబ్రత ఆ ఇంట్లో పనిచేసే నరేంద్ర అనే వ్యక్తితో కలిసి కొత్త ఇంటికి వచ్చాడు. నరేంద్రకు మద్యం అలవాటు ఉంది. రోజూ రాత్రి తాగి అల్లరి చేసేవాడు. ఈ దురలవాటు మానివేయమని సత్యబ్రత నరేంద్రను అనేక సార్లు మందలించాడు కానీ వినకపోవడంతో చేయిచేసుకునేవాడు. రంగులు కొనుగోలు చేసి మంగళవారం రాత్రి వారిద్దరూ కొత్త ఇంట్లో నిద్రపోయారు. 
 
ఈ నేపథ్యంలో నరేంద్ర అర్ధరాత్రి లేచి సత్యబ్రత తలపై గొడ్డలితో నరికి చంపేశాడు. 'మద్యం తాగవద్దని అడ్డుపడినందుకు చంపేశాను' అని సుద్ద ముక్కతో గోడపై కారణాన్ని రాసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఖుర్దా పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఖుర్దా ఆసుపత్రికి తరలించారు, నరేంద్ర కోసం గాలింపులు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments