Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ రూల్స్ బ్రేక్.. సోదరుడు పెళ్లిలో తాహసీల్దార్ డ్యాన్స్

Webdunia
సోమవారం, 24 మే 2021 (11:36 IST)
దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. వివాహాలకు కేవలం 25 లేదా 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే, ఒరిస్సాకు చెందిన ఓ త‌హ‌సీల్దార్ లాక్డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించింది. 
 
త‌న సోదరుడి వివాహ వేడుక‌లో భాగంగా ఏర్పాటు చేసిన బ‌రాత్ కార్య‌క్ర‌మంలో ఆ త‌హ‌సీల్దార్ మాస్కు ధ‌రించ‌లేదు. అంతేకాకుండా, అక్కడున్న వారితో క‌లిసి డ్యాన్స్ చేసింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం ఒడిశా ప్ర‌భుత్వం లాక్డౌన్‌ను అమ‌లు చేస్తోంది. 
 
వివాహ వేడుక‌ల‌కు కేవ‌లం 25 మందికి మాత్ర‌మే ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే ఓ మ‌హిళా త‌హసీల్దార్ త‌న సోద‌రుడి వివాహానికి హాజ‌రైంది. ఈ వేడుక‌లో లాక్డౌన్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా స‌ద‌రు త‌హ‌సీల్దార్ మాస్కు ధ‌రించ‌కుండా స్టెప్పులేసింది. ఈ వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి.
 
ఈ వీడియోల‌పై జాజ్‌పూర్ జిల్లా క‌లెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి సింగ్ రాథోడ్ స్పందించారు. ప్ర‌స్తుతం ఆ మ‌హిళా ఆఫీస‌ర్ సెల‌వులో ఉన్నారు. సెల‌వులు ముగిసి వీధుల్లో హాజ‌రైన త‌ర్వాత ఆమె నుంచి వివ‌ర‌ణ కోరి, త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన ఆఫీస‌రే.. నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం స‌రికాద‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు

తండేల్ లో బాగా కష్టం అనిపించింది అదే : నాగ చైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments