Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై విరుచుకుపడిన నరరూప రాక్షసుడు.. బ్లేడుతో గొంతుకోసి రక్తాన్ని పీల్చాడు..

మూడేళ్ల బాలికపై విరుచుకుపడ్డాడు. ముద్దులొలికే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బ్లేడుతో అమానుషంగా చిన్నారి గొంతు కోశాడు. ఆపై ధారగా కారుతున్న నెత్తురును తాగేందుకు ప్రయత్నించాడు.. ఆ నరరూప రాక్షసుడు. ఈ

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (09:14 IST)
మూడేళ్ల బాలికపై విరుచుకుపడ్డాడు. ముద్దులొలికే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బ్లేడుతో అమానుషంగా చిన్నారి గొంతు కోశాడు. ఆపై ధారగా కారుతున్న నెత్తురును తాగేందుకు ప్రయత్నించాడు.. ఆ నరరూప రాక్షసుడు. ఈ ఘటన ఒడిస్సాలో చోటుచేసుకుంది. ఆ దుర్మార్గుడి దుశ్చర్యతో అభంశుభం తెలియని ఆ చిన్నారి ఇప్పుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 
 
ఇంతకీ ఆ రాక్షసుడు ఆ బాలిక పొరుగింటివాడే. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని ముఖం, పెదవులపై రక్తపు మరకలను గుర్తించారు. కాగా నిందితుడి మానసిక పరిస్థితి సరిగ్గానే ఉందని, తాను ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో చెప్పట్లేదని పోలీసులు చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిసా గంజాం జిల్లాలో బడా అర్జీపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక మూడో తరగతి చదువుతోంది. ఆదివారం తోటి వారితో ఈ చిన్నారి ఆడుకుంటుండగా.. పొరుగున ఉండే బైరాగి (33) అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో బాలిక గొంతును కోశాడు. ఆపై బాలిక కుత్తిక వద్ద నోటిని పెట్టి రక్తం పీల్చేందుకు ప్రయత్నించాడు. గుర్తించిన స్థానికులు నిందితులు వెంబడించి అతనిని పట్టుకున్నారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments