Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరితో తాళి.. మరొకరితో ప్రేమ.. ఇంకో వ్యక్తితో జంప్.. ఎక్కడ?

ఒకరితో తాళి కట్టించుకుని రెండు రోజులు కాపురం చేసింది. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్ళింది. అతనితో ఐదు రోజుల పాటు సంసారం చేసింది. చివరకు అతను కూడా నచ్చలేదని పేర్కొంటూ మరో వ్యక్తిని తీసుకుని పా

Webdunia
సోమవారం, 16 జులై 2018 (13:59 IST)
ఒకరితో తాళి కట్టించుకుని రెండు రోజులు కాపురం చేసింది. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్ళింది. అతనితో ఐదు రోజుల పాటు సంసారం చేసింది. చివరకు అతను కూడా నచ్చలేదని పేర్కొంటూ మరో వ్యక్తిని తీసుకుని పారిపోయింది. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ జిల్లాకు చెందిన ఓ యువతికి పెద్దలు అదేప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేశారు. అతనితో రెండు రోజులపాటు కాపురం చేసింది. ఆ తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసింది. అతనితో మరో ఏడడుగులు వేసింది. ఇతడితో కేవలం ఐదు రోజులు మాత్రమే సంసారం చేసింది. ఆ తర్వాత మరో వ్యక్తితో జంప్‌ అయింది. ఇది కొరాపుట్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 
 
దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూలదండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండో భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్‌ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్‌ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments