Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సా సీఎం సంచలన నిర్ణయం : 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు...

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (11:55 IST)
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 76వ పుట్టిన రోజు వేడుకలు ఆయన శనివారం జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొలువులను రెగ్యులైజ్ చేశారు. పైగా, రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఏకంగా రూ.1300 కోట్ల భారంపడనుంది. 
 
ఈ మేరకు శనివారం తన సారథ్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. 
 
ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిని శాశ్వతంగా రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్లు లేవని, కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్ జరుగుతోందని గుర్తు చేశారు. 
 
ఒరిస్సాలో దానికి ఇప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా 57 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రకటన చేయగానే కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. దీపావళి పండుగ ముందే వచ్చిందంటూ స్వీట్లు పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments