Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీకి అనుమతి నిరాకరణ!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (09:51 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో బీజేపీ రథసారథి అమిత్ షా నిర్వహించతలపెట్టిన ర్యాలీకి ఆ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆదివారం చేపట్టనున్న ఈ ర్యాలీకి అనుమతించాలని పార్టీ చేసుకున్న దరఖాస్తును కార్పొరేషన్ గురువారం తిరస్కరించింది. దీంతో కోర్టు మెట్లెక్కేందుకు అమిత్ షా నిర్ణయించుకున్నారు. ర్యాలీపై తమ ఇంజినీర్లు వ్యక్తం చేసిన ఆందోళనలతోనే అనుమతి నిరాకరిస్తున్నట్లు కమిషనర్ ఖలీల్ అహ్మద్ బీజేపీకి సమాచారమందించారు. 
 
కమిషనర్ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర శాఖ భగ్గుమంది. తమ ప్రభంజనానికి జడిసిన తృణమూల్ సర్కారు కమిషనర్ చేత అనుమతి నిరాకరింపజేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హా ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకే కమిషనర్ అనుమతి నిరాకరించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించనున్నామని ఆయన వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments