Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులందరూ.. దోసెకే ఓటేశారు.. ఇండియన్ ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్‌గా దోసె..

ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్లేవారు రెండో ఆలోచన లేకుండా దోసెనే ఆర్డర్ చేస్తున్నారట. టిఫిన్లపై జరిపిన స్విగ్గీ అనే ఆన్ లైన్ డెలివరీ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో ఈ

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (17:52 IST)
భారతీయులందరూ ఆ విషయంలో మాత్రం ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దోసెకే ఓటేశారు. భారతీయుల వంటకాలు రాష్ట్రానికి రాష్ట్రం తేడా వుంటుంది. భాషల పరంగా, ప్రాంతాల పరంగా ఆహారాల పదార్థాలు కూడా మారిపోతాయి. దక్షిణాది వంటకాలకు, ఉత్తరాది వంటకాలకు తేడా వుంటుంది.

దక్షిణాది వారు ఎక్కువగా ఇడ్లీ సాంబారు, దోసె వంటివి తీసుకుంటే.. ఉత్తరాది వారు ఎక్కువ చపాతీ, పుల్కా, దాల్ వంటివి తీసుకుంటారు. అయితే తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో భారతీయుల్లో అత్యధికులు దోసెనే అధికంగా ఇష్టపడుతున్నారు. 
 
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్లేవారు రెండో ఆలోచన లేకుండా దోసెనే ఆర్డర్ చేస్తున్నారట. టిఫిన్లపై జరిపిన స్విగ్గీ అనే ఆన్ లైన్ డెలివరీ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లోని 12 వేల రెస్టారెంట్లలో టిఫిన్ ఆర్డర్లపై ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో దోసె అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో పోహా, పరోటాలు నిలిచాయి. వారాంతాల్లో దోసెల అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆ సర్వేలో వెల్లడి అయ్యింది
 
దోసెలో ప్లెయిన్ దోశ, మసాలా, రవ్వ, ఆనియన్, ఆనియన్ రవ్వ వంటి అనేక రకాలుండటంతో దోసెలను మన భారతీయులు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబారు వంటి వాటితో నంజుకుని తెగ లాగిస్తున్నారట. అదన్నమాట సంగతి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments