Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రాలేదు.. ప్రతిపక్ష హోదా అసాధ్యం : సుమిత్రా

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (10:54 IST)
లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ఇక ప్రతిపక్ష హోదాను కల్పించలేమని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో తమ వర్గం నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం తోసిపుచ్చారు. ‘నేను నిబంధనలు, సంప్రదాయాల మేరకు నడుచుకున్నాను' అని తన నిర్ణయంపై వ్యాఖ్యానిస్తూ సుమిత్రా మహాజన్ అన్నారు. 
 
స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక లేఖలో తెలియజేసారు. లోక్‌సభలో తమ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలని కోరుతూ సోనియా గాంధీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాయడం తెలిసిందే. ఈ విషయంలో స్పీకర్ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించడానికి తగినంత సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి లేదని రోహ్తగి అభిప్రాయ పడ్డారు. 
 
కాగా, 542 మంది సభ్యులుండే లోక్‌సభలో భారతీయ జనతా పార్టీకి 282మంది సభ్యులుండగా, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే బీజేపీ తర్వాత సభలో తమదే అతిపెద్ద పార్టీ గనుక తమకే ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతూ ఉంది. ప్రతిపక్ష హోదా కోరడానికి అవసరమైన 55 మంది సభ్యుల కనీస సంఖ్యాబలం లేనందున పార్టీకి ఆ పదవి ఇచ్చే స్థితిలో తాను లేనని సుమిత్రా మహాజన్ కాంగ్రెస్‌కు తెలియజేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments