Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి తర్వాత మతం మారదు : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

మతాంతర వివాహం చేసుకున్న మహిళకు పెళ్లి తర్వాత ఆమె మతం మారదనీ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అంటే వివాహం తర్వాత భర్త మతమే ఆమెకు వర్తిస్తుందని తెలిపే చట్టాలేమీలేవని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐ

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (11:38 IST)
మతాంతర వివాహం చేసుకున్న మహిళకు పెళ్లి తర్వాత ఆమె మతం మారదనీ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అంటే వివాహం తర్వాత భర్త మతమే ఆమెకు వర్తిస్తుందని తెలిపే చట్టాలేమీలేవని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
ఇతర మతానికి చెందిన వ్యక్తిని.. గూల్రోఖ్‌ ఎం.గుప్తా అనే పార్శీ మహిళ వివాహం చేసుకుంటే ఆమె మతాన్ని కోల్పోతుందా? అన్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారణకు స్వీకరించి కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న పార్శీ మహిళ తన మతాన్ని కోల్పోయి, భర్త మత విశ్వాసాలకు చెందిన వ్యక్తి అవుతుందని 2010లో గుజరాత్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గుప్తా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments