Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్ర‌మ సంతానం ఉండ‌దు: క‌ర్ణాట‌క హైకోర్టు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (10:24 IST)
అక్ర‌మ సంతానం విష‌యంలో క‌ర్ణాట‌క హైకోర్టు కీల‌క తీర్పుఇచ్చింది.  ఈ ప్ర‌పంచంలో అక్ర‌మ త‌ల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్ర‌మ సంతానం ఉండ‌ద‌ని పేర్కొన్న‌ది. 

త‌మ పుట్టుక‌లో పిల్ల‌ల పాత్ర ఏమీ ఉండ‌ద‌ని కోర్టు పేర్కొన్న‌ది.  బెంగ‌ళూరు ప్ర‌భుత్వ విద్యుత్ రంగ సంస్థ బెస్కాంలో గ్రెడ్ 2 లైన్‌మెన్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి మ‌ర‌ణించ‌డంతో ఆ ఉద్యోగాన్ని ఇవ్వాల‌ని ఆయ‌న రెండో భార్య కుమారుడు బెస్కాంకు విజ్ఞ‌ప్తి చేయ‌గా, బెస్కాం తిర‌స్క‌రించింది. 

మొద‌టి భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండా రెండో పెళ్లి చేసుకోవ‌డం చ‌ట్టవిదుద్ధ‌మ‌ని, అలాంటి రెండో భార్య సంతానానికి ఉద్యోగం ఇవ్వడం కుద‌ర‌ద‌ని బెస్కాం తెలిపింది.
 
దీంతో రెండో భార్య కూమారుడు హైకోర్టును ఆశ్ర‌యించాడు. మొద‌ట సింగిల్ బెంచ్ ఈ కేసుకు కొట్టివేసింది. కాగా జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న‌, జ‌స్టిస్ సంజీవ్‌కుమార్‌ల‌తో కూడిన డివిజ‌న్ బెంచ్ కీల‌క తీర్పు ఇచ్చింది.

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. త‌ల్లిదండ్రులు లేకుండా పిల్ల‌లు పుట్ట‌ర‌ని, త‌మ పుట్టుక‌లో వారి పాత్ర ఏమీ లేద‌ని, అక్ర‌మ త‌ల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్ర‌మ సంతానం ఉండ‌ద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది.

రెండో భార్య కుమారుడు సంతోష‌కు ఉద్యోగం ఇచ్చే విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని బెస్కాంను ఆదేశించింది. అదేవిధంగా చ‌ట్ట‌బ‌ద్ద వివాహాల ప‌రిధికి వెలుప‌ల జ‌న్మించే చిన్నారుల‌కు ఎలా ర‌క్షణ క‌ల్పించాల‌న్న దాని గురించి పార్ల‌మెంటు ఆలోచించాల‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments