Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (09:02 IST)
సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులను ఎంపిక చేసే విషయంలో కుల, వర్గ ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించే నిబంధనేదీ లేదని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో రామస్వామి నీలకంఠన్, జాన్ సత్యంలను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం 2023 జనవరిలో సిఫార్సు చేసినప్పటికీ ఇప్పటివరకూ ఎందుకు నియామకం జరపలేదంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు, అనుబంధ ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. హైకోర్టు జడ్జీల్లో ఎందరు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఉన్నారన్న సమాచారాన్ని తెలిపే పట్టికేదీ కేంద్రం నిర్వహించదని వెల్లడించారు. 
 
2018 తర్వాత అభ్యర్థులు తమ సామాజిక నేపథ్య వివరాలు తెలపాల్సి వస్తోందని, అప్పటి నుంచి 684 మంది హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కాగా వారిలో 21 మంది ఎస్సీ వర్గానికి, 14 మంది ఎస్టీ వర్గానికి 82 మంది ఓబీసీ వర్గానికి 37 మంది మైనారిటీ వర్గానికి చెందిన వారు ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టులో ఇద్దరు, హైకోర్టుల్లో 106 మంది మహిళా న్యాయమూర్తులు వివిధ పనిచేస్తున్నారని తెలిపారు. 
 
తమకు అందిన సమాచారం, వివిధ నివేదికల ఆధారంగా అభ్యర్థులు ఆ పదవికి తగినవారా కాదా అన్నది. అంచనా వేస్తామని పేర్కొన్నారు. పూర్తిగా అర్హులే నియమితులయ్యేందుకు వీలుగా ప్రభుత్వం తన సొంత అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. న్యాయమూర్తుల నియామకం ప్రతిభ ఆధారంగా జరగాలని, అభ్యర్థులు నిజాయితీ, నైపుణ్యం, మానసిక స్థిరత వంటి గుణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments