Webdunia - Bharat's app for daily news and videos

Install App

నో.. కామెంట్.. ఎన్ కౌంటర్ పై తమిళ మీడియాకు గవర్నర్ సమాధానం

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (08:58 IST)
శేషాచల ఎన్ కౌంటర్ పై స్పందించాలంటూ పట్టుబట్టిన తమిళ మీడియాకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఎంత ఒత్తిడి చేసినా ఆయన నో కామెంట్ అనడం మినహా మరో సమాధానం చెప్పలేదు. చివరకు భద్రతా సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు మధ్యన గొడవ జరిగింది. 
 
తిరువళ్లూరులోని ప్రసిద్ధ ఆలయం వీరరాఘవ స్వామి దర్శనం కోసం 3 నెలలకోసారి ఆయన వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం తన సతీమణితో వచ్చిన ఆయనను దర్శనానంతరం మీడియా ప్రతినిధులు చుట్టముట్టారు. ఎన్‌కౌంటర్‌పై మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ఆయన తల ఊపుతూ ముందుకు కదిలారు. 
 
అయితే, మీడియా మాత్రం మాట్లాడాలని కోరింది. దీంతో ఆగ్రహించిన భద్రతా సిబ్బంది మీడియాను తోసేశారు. దీంతో మీడియా ప్రతినిధులకు, భద్రతా సిబ్బందికి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. అనంతరం, తిరుగు ప్రయాణమవుతున్న గవర్నర్‌ను మీడియా ప్రతినిధులు మరోసారి చుట్టముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో నిమిషం పాటు ఆలోచించిన గవర్నర్.. ‘నో కామెంట్.. నో కామెంట్’ అంటూ వెళ్లిపోయారు.
 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments