Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్ ద్వారా రూ.4 లక్షలు అర్జిస్తున్న కేంద్ర మంత్రి!!

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. జాతీయ రహదారుల శాఖామంత్రిగా ఉన్నారు. ఈయన యూట్యూబ్ ద్వారా నెలకు రూ.4 లక్షల మేరకు సంపాదిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. 
 
తాజాగా, హ‌ర్యానాలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో తాను ఇంటికే పరిమితమై రెండు పనులు చేశాన‌ని అన్నారు. ఒకటి ఇంట్లో వంట చేయడం కాగా, ఇంకోటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడం అని ఆయ‌న చెప్పారు. 
 
తాను ఆన్‌లైన్‌లో చాలా క్లాసులు తీసుకున్నానని, వాటిని యూ ట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేశాని వివ‌రించారు. దీంతో వాటికి వ్యూస్ బాగా వ‌చ్చాయ‌ని, యూట్యూబ్ త‌న‌కు నెలకు నాలుగు లక్షలు చెల్లిస్తోందని తెలిపారు.
 
తాను త‌న బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోనని స్పష్టం చేశారు. త‌న‌ పెళ్లైన కొత్తలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. త‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ రోడ్డు మధ్యలో ఇంటిని క‌ట్టుకున్నార‌ని, ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లి అక్కడ నుంచి తన వద్దకు వచ్చిందన్నారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నిర్మించినా కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. అయితే, ఈ చ‌ర్య‌లు తన భార్య కాంచనకు తెలియకుండా తీసుకున్నాన‌ని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments