Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులకి ఉరి: తీహార్ జైలుకి చేరుకున్న పవన్

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (20:47 IST)
నిర్భయ దోషులు తమకు విధించిన ఉరి శిక్ష నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గత కొన్ని రోజులుగా చేస్తున్న యత్నాలన్నీ ఫలించలేదు. దీనితో మరో రెండు రోజుల్లో వారిని ఉరి తీయనున్నారు. ఈ నేపధ్యంలో వారిని ఉరి తీసేందుకు మీరట్ నుంచి తలారి పవన్ జల్లాద్ తీహార్ జైలుకి చేరుకున్నారు. ఆయనకు అవసరమైన సౌకర్యాలను జైలు ప్రాంగణంలో జైలు అధికారులు ఏర్పాటు చేశారు. 
 
ఫిబ్రవరి ఉదయం నిర్భయ దోషులను ఉరి తీయనున్న నేపధ్యంలో డమ్మీలతో రేపు ట్రయల్స్ నిర్వహించున్నట్లు సమాచారం. అలాగే బక్సర్ నుంచి తెప్పించిన ఉరి తాళ్ల సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తారని చెపుతున్నారు. 
 
తీహార్ కారాగార ప్రాంగణంలోని 3వ నెంబర్ జైలులో నిర్భయ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. దోషుల్లో ఇప్పటివరకూ ఒకరొకరుగా వేసుకున్న పిటీషన్లన్నీ కొట్టివేయబడ్డాయి. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు ప్రాణభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి పిటీషన్ పెట్టుకున్నాడు. అది పెండింగులో వుంది. ఉరి వేసేందుకు మరో రెండ్రోజులే సమయం వున్నందున దీనిపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments