'నిర్భయ' దోషులను ఎందుకు ఉరితీయరు?

గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (09:16 IST)
గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులతో పాటు.. దక్షిణ ఢిల్లీ జిల్లా డీసీపీకి డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ నోటీసులు జారీ చేశారు. 
 
తమ కుమార్తెపై దారుణంగా మూకుమ్మడి అత్యాచారం చేసి చంపేసిన కేసులో దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ధ్రువీకరించిన ఆరు నెలల తర్వాత కూడా వారిని ఉరి తీయలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసు ఇచ్చామని కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
 
కాగా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌, క్యూరేటివ్‌ పిటిషన్‌, న్యాయ మార్గాల తర్వాత చిట్టచివరగా రాష్ట్రపతిని క్షమాభిక్ష వేడుకునే వంటి అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ మరణశిక్ష పడిన ఆ నలుగురి విషయంలో డీసీడబ్ల్యూ నోటీసు జారీ చేయడం విశేషం. దీనిపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments