Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో చిత్రహింసలు.. నాకు పిచ్చెక్కింది.. నిర్భయ దోషి కొత్త ఎత్తుగడ

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (10:22 IST)
నిర్భయ అత్యాచార కేసులో దోషిగా తేలిన ముద్దాయిల్లో ఓ ముద్దాయి సరికొత్త ఎత్తుగడ వేశారు. తీహార్ జైలు అధికారులు చిత్రహింసలకు గురిచేశారనీ, ఫలితంగా తనకు పిచ్చెక్కినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను మానసిక రోగంతో బాధపడుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ముద్దాయి పేరు వినయ్ శర్మ. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరుగనుంది. 
 
నిజానికి నిర్భయ దోషులకు జనవరి 22వ తేదీనే ఉరితీయాల్సివుంది. కానీ, వినయ్ శర్మే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరితీస్తారని భావించారు. కానీ, నలుగురు నిందితులు నాలుగు రకాలుగా మార్చిమార్చి పిటిషన్లు దాఖలు చేస్తూ ఊరిశిక్షలను అమలు కాకుండా సాగదీస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న ఉద్దేశంతో రాజ్యాంగం, చట్టం ప్రసాదించిన అవకాశాలను వినియోగించుకుంటూ దోషులు రోజుకో ఎత్తుగడతో కాలహరణం చేస్తూ వస్తున్నారు. 
 
తాజాగా వినయ్ శర్మ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 'నన్ను తీహార్‌ జైల్లో చిత్రహింసలు పెట్టారు. ఆ కారణంగా నాకు పిచ్చెక్కింది. మానసిక సమస్యతో నేను బాధపడుతున్నాను' అంటూ తాజాగా దోషి వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపాడు. ఈ కారణాన్ని చూపిస్తూ రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడాన్ని సవాల్‌ చేశాడు. 
 
తన మానసిక వ్యాధిని దేశ ప్రథమ పౌరుడు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. మరోవైపు పిటిషనర్‌ ఆరోగ్యంగానే ఉన్నాడని, ఎటువంటి మానసిక సమస్యలు లేవని కేంద్రం కోర్టుకు తెలిపింది. కాగా, పిటిషన్‌ స్వీకరించి విచారించిన ధర్మాసనం తీర్పు ఈరోజుకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments