Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరవ్ మోదీ పెయింటింగ్స్ వేలంతో 55 కోట్లు రాబట్టిన ఐటి శాఖ

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (18:44 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన భారీ కుంభకోణంలో నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన పెయింటింగ్స్‌ను ఆదాయపన్ను శాఖ మంగళవారం వేలం వేసింది. ఈ వేలంలో ఆదాయపు పన్ను శాఖకు 59.37 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ నీరవ్ మోదీకి చెందిన 68 పెయింటింగ్స్‌ను వేలం వేసింది. 
 
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 13,000 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసిన నిందితుడు నీరవ్ ఆదాయపన్ను శాఖకు ఇప్పటివరకు రూ.97 కోట్లు బకాయి ఉన్నాడు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టు మార్చి 20న దర్యాప్తు సంస్థలు నీరవ్ మోదీకి యాజమాన్య హక్కులున్న 173 పెయింటింగ్స్, 11 వాహనాలను వేలం వేసేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రైవేట్ కంపెనీ సహాయం తీసుకుని ఈ పెయింటింగ్స్ వేలం వేసింది. కంపెనీ కమిషన్ మినహహాయించుకుని ఆదాయపన్ను శాఖకు మొత్తం 54.84 కోట్ల రూపాయలు వస్తాయి. నీరవ్ మోదీ పెయింటింగ్ కలెక్షన్‌లో రాజా రవి వర్మ, జగన్ చౌదరి, వీఎస్ గాయ్ తోండే, ఎఫ్ఎన్ సూజా, అక్బర్ పదమ్సీ వంటి సుప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్స్ ఉన్నాయి. 
 
వీఎస్ గాయ్ తోండే గీసిన ఒక పెయింటింగ్ రూ.25.24 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ పెయింటింగ్‌కు 2015వ సంవత్సరంలో 29.3 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది. అప్పుడు దీనిని దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్ గా చెప్పుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments