Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట్నా పేలుళ్ల కేసులో నలుగురికి మరణదండన

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (19:36 IST)
గత 2013లో బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నలుగురు వ్యక్తులను దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఈ నలుగురు ముద్దాయిలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 9 మంది దోషులుగా తేలగా, వీరిలో నలుగురికి ఉరిశిక్షను విధించగా, మరో ఇద్దరికీ యావజ్జీవం, మరో ఇద్దరికీ పదేళ్లు, ఒకరికీ ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ జడ్జి గుర్విందర్‌ సింగ్‌ మల్హోత్ర తీర్పునిచ్చారు. 
 
బాంబు పేలుళ్లు జరిగిన 8 ఏళ్ల తర్వాత.. కేసులో దోషులకు శిక్ష ఖరారైంది. గత 2013 అక్టోబరు 27వ తేదీన బిహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో బిజెపి నేతృత్వంలో హుంకార్‌ సభ జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రధాన మంత్రి అభ్యర్థి హోదాలో ముఖ్య అతిధిగా నరేంద్ర మోడీ హాజరయ్యారు. 
 
మోడీతో పాటు పలువురు వేదికపై ఉన్న సమయంలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 89 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మరుసటి రోజే ఎన్‌ఐఎ దర్యాప్తు చేపట్టింది. తర్వాత ఏడాదికి చార్జీషీట్‌ దాఖలు చేసి.. 11 మందిని జాబితాలో చేర్చింది. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఇద్దరు నిర్దోషులుగా బయటపడ్డారు. ఇపుడు తీర్పురాగా, నలుగురు మరణశిక్షను ఎదుర్కోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం