Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 17 చోట్ల ఎన్.ఐ.ఏ సోదాలు...

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (11:52 IST)
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ మంగళవారం దేశ వ్యాప్తంగా 17 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఓ లష్కరే ఉగ్రవాది బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులోని ఖైదీలకు ఉగ్రవాద భావజాలం బోధిస్తున్నట్టు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా వీటిని చేపట్టినట్లు తెలుస్తోంది. అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలున్న తమిళనాడు, కర్ణాటక సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి.
 
జులై 2023 బెంగళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. వీరందరూ లష్కరే తోయిబా ఉగ్రవాది నజీర్‌ భావజాలంతో ప్రభావితమైనవారిగా గుర్తించారు. అప్పట్లో నిందితుల నుంచి మందుగుండు, ఆయుధాలు, గ్రనేడ్లు, వాకీటాకీలు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. నజీర్‌ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నాడు. గతేడాది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. 
 
ఈ నెల మొదట్లో బెంగళూరు రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన చోటుచేసుకొన్న విషయం తెలిసిందే. ఆ కేసును కూడా నిన్న జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఆ మర్నాడే 2023 నాటి ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించిన తనిఖీలు చోటు చేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం