Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌‍కు పారిపోయిన హనీప్రీత్... డేరా చీఫ్‌గా గుర్మీత్ సింగ్ తనయుడు!

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో హర్యానాలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్‌కు జైలుశిక్ష పడిన తర్వాత జరిగిన విధ్వంసం కేసులో కీలక నిందితురాలిగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు భావిస్తున్

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (15:27 IST)
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో హర్యానాలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్‌కు జైలుశిక్ష పడిన తర్వాత జరిగిన విధ్వంసం కేసులో కీలక నిందితురాలిగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు భావిస్తున్న డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ నేపాల్‌కు పారిపోయింది. దీంతో ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమె కోసం ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు.
 
సిర్సా డేరాకు అనుబంధంగా ఉదయ్‌పూర్‌లో నడుస్తున్న డేరా ఆశ్రమ ఇన్ చార్జ్ ప్రదీప్ గోయల్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని విచారించి హనీప్రీత్ ఎక్కడుందన్న విషయాన్ని కూపీ లాగారని తెలుస్తోంది. ఆమె ఆచూకీపై ప్రదీప్ నుంచి స్పష్టమైన సమాచారం లభించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
ఇకపోతే... డేరా తదుపరి చీఫ్‌గా గుర్మీత్‌ రాంరహీమ్‌ సింగ్‌ కుమారుడు జస్మీత్‌ సింగ్ పగ్గాలు చేపట్టనున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే ఆందోళనతో డేరా మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ విపాసన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కుమాడికే డేరా బాధ్యతలు అప్పగించేందుకు గుర్మీత్‌ అంగీకరించారు. గుర్మీత్‌, హనీప్రీత్‌ తర్వాత డేరా సచా సౌథాలో మూడో అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా జస్మీత్ గుర్తింపు పొందారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments