Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రోజున చికెన్ కూర కలిపిన అన్నంలో విషం కలుపుకుని..?

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (14:44 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు.. కానీ ఏమైందో ఏమో కానీ శోభనం రోజు రాత్రే అనూహ్య ఘటన జరిగింది. వధూవరులు ఇద్దరూ విషం తాగేశారు. విషమ పరిస్థితుల్లో ఉన్న వాళ్లిద్దరినీ బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సోనేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్‌షెడ్‌పూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల శాంతీ దేవికి, గోపాల్‌గంజ్ నగరంలోని మిర్జ్‌గంజ్‌కు చెందిన ముకేష్ కుమార్ సింగ్ అనే 30 ఏళ్ల వ్యక్తికి శనివారం ఓ గుడిలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం ఆ దంపతులను ఇంటికి తీసుకెళ్లారు. 
 
రాత్రి భోజన కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అయితే ఏమైందో ఏమో కానీ సోమవారం తెల్లవారుజామున వారిని నిద్రలేపేందుకు వెళ్లిన బంధువులకు అపస్మారక స్థితిలో కనిపించారు.
 
పక్కనే చికెన్ కూర కలిపిన అన్నం కూడా ఉంది. దాంట్లోనే విషం కలుపుకుని ఇద్దరూ తిని ఉంటారని అంతా భావిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ పెళ్లే అయినా ఎందుకు ఇలా చేశారన్నది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. వాళ్లు కోలుకుంటేనే కానీ అసలేం జరిగిందన్నది తెలియదని బంధువులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments