Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు బోగీలోని టాయిలెట్‌లో పసికందు.. పేగు రక్తం కూడా తడారలేదు.. ప్రాణాలు మాత్రం..?!

రైలులో వెళ్తూ వెళ్తూ ఆ తల్లి టాయిలెట్‌లో ప్రసవించిందా..? లేకుంటే ఎక్కడో ప్రసవించిన ఆమె రైలు బోగీల్లోని టాయ్‌లెట్‌లో బిడ్డను పడేసిందా? అడ్డుగా ఉందని తొలగించుకుందో? క్షణికావేశంలో చేసిన తప్పుకు బిడ్డను బ

Webdunia
సోమవారం, 25 జులై 2016 (14:35 IST)
రైలులో వెళ్తూ వెళ్తూ ఆ తల్లి టాయిలెట్‌లో ప్రసవించిందా..? లేకుంటే ఎక్కడో ప్రసవించిన ఆమె రైలు బోగీల్లోని టాయ్‌లెట్‌లో బిడ్డను పడేసిందా? అడ్డుగా ఉందని తొలగించుకుందో? క్షణికావేశంలో చేసిన తప్పుకు బిడ్డను బలిచేసిందో కానీ.. రైలు బోగిలోని టాయ్‌లెట్ డోర్ తెరిచి చూడగానే పేగు రక్తం కూడా  తడారని పసికందును చూసి బాత్రూమ్ క్లీన్ చేసే తేజ్ ప్రతాప్ సింగ్ అనే అటెండెంట్ షాకయ్యాడు. 
 
స్టేషన్ మాస్టార్‌కి విషయాన్ని తెలిపాడు. స్టేషన్ మాస్టార్‌ వచ్చి బిడ్డకు ఊపిరి ఉందా లేదా చూశాడు. కానీ అప్పటికే ప్రాణాలు గాల్లో కలిసిపోగా.. పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఈ ఘటన జరిగింది. ఉన-హిమాచల్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్లో రైలును పక్కనే ఆపేశారు. 
 
టాయ్‌లెట్‌లో దుర్గంధం భరించలేక ఆ పసిప్రాణం విలవిలలాడి.. గాల్లో కలిసిపోయిందని.. ఆ పసిబిడ్డ ఏం పాపం చేసిందని అలా టాయ్‌లెట్‌లో పడేశారని ప్రయాణీకులు వాపోయారు. ఇకపోతే.. నెలలు నిండకుండానే పుట్టడంతో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని.. బాడీని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)కి పోస్టుమార్టం నిమిత్తం అప్పగించినట్లు వైద్యులు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments