Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త తరహా మోసం గురూ... మహిళలను గర్భవతులు చేస్తే రూ.25 లక్షలు

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (17:49 IST)
తమ సంతాన సాఫల్య కేంద్రానికి సంతానం కోసం వచ్చే మహిళలతో శారీరకంగా కలిసి వారిని గర్భవతిని చేస్తే రూ.25 లక్షల నగదు ఇస్తామంటూ ఓ ముఠా నేపాల్ వాసి నుంచి రూ.50 వేలను స్వాహా చేసింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. పుదుచ్చేరిలోని మహేలో శ్రీజిత్ (44) అనే వ్యక్తి స్థానికంగా ఒక గెస్ట్ హౌస్ నడుపుతున్నాడు. ఇక్కడ నేపాల్‌కు చెందిన షాజన్ భట్టారాయ్ (34) ఉంటూ అన్ని రకాల పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో షాజన్‌కు మొబైల్‌కు గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ చేసి... తనవద్ద ఒక బెస్ట్ ఆఫర్ ఉందని, తమ కేంద్రానికి వచ్చే మహిళలను గర్భవతులను చేస్తే రూ.25 లక్షలు ఇస్తామంటూ నమ్మించాడు. 
 
ఇందుకోసం ముందుగా రూ.2 లక్షల అడ్వాన్స్ ఇస్తామని, అయితే, ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు, గుర్తింపు కార్డు ఇవ్వాలంటూ కోరాడు. ఆ మోసగాడి మాటలు గుడ్డిగా నమ్మిన షాజన్.. అడిగినవన్నీ పంపించాడు. కొంతసేపటి తర్వాత ఒక మహిళతో శారీరకంగా కలిసి ఉండేందుకు ముందుగానే రూ.5 లక్షలు, రూ.49 వేలు చొప్పున షాజన్ బ్యాంకు ఖాతాకు డబ్బులు డిపాజిట్ చేసినట్టుగా రిసిప్టులను మొబైల్ వాట్సాప్ నంబరుకు పంపించాడు. 
 
అయితే, ఈ డబ్బును పూర్తిగా పొందాలంటే దరఖాస్తు ఫాంను పూర్తి చేసి, దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాడు. దీంతో షాజన్ తన బ్యాంకు ఖాతాలో వారు పంపిన నగదు డిపాజిట్ అయిందా లేదా అనే విషయాన్ని తనిఖీ చేయకుండానే ఆ వ్యక్తి పంపిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా, బ్యాంకు ఖాతాలోని రూ.50 వేలను మోసగాళ్ళు తమ బ్యాంకు ఖాతాల్లోకి మార్చుకున్నాడు. ఆ తర్వాత షాజన్ తన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా, అందులో డబ్బులు డిపాజిట్ కాలేదు కదా, ఆ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలు మాయమైనట్టు గుర్తించి, లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments