Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎటకారం' సినీ యూనిట్ ను వెంబడించిన నేపాల్ భూకంపం... నృత్య దర్శకుడు విజయ్‌ దుర్మరణం

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (11:41 IST)
నేపాల్‌లో 'ఎటకారం' చిత్రాన్ని షూటింగ్ చేసేందుకు వెళ్లిన 'ఎటకారం' మూవీ యూనిట్ ను నేపాల్ భూకంపం వెంటాడి అందులో విజయ్ అనే నృత్య దర్శకుడిని పొట్టనబెట్టుకుంది. భూకంప సమయంలో వారు ఖాట్మండు నుంచి తిరిగి వస్తుండగా సభ్యులు ప్రయాణిస్తున్న కారు పల్టీకొట్టడంతో ఆ ప్రమాదంలో 25 ఏళ్ల నూతన నటుడు విజయ్‌ మృతి చెందాడు.
 
ఎటకారం చిత్ర యూనిట్ సేఫ్ గా ఉందని వార్తలు వచ్చిన నేపధ్యంలో నృత్య దర్శకుడు విజయ్ కన్నుమూశారనే వార్త టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేపాల్ భూకంప సమయంలో ఆయన కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు బోల్తా కొట్టిందనీ, దాంతో ఆయన మృత్యువాత పడినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 
 
నృత్య దర్శకుడు విజయ్ గుంటూరు జిల్ల బాపట్ల వాస్తవ్యుడు. తండ్రి స్టీలు సామానుల వ్యాపారం చేస్తుంటారు. బాపట్ల మార్కెట్ ప్రాంతంలో నివాసముంటున్న విజయ్ నృత్యంపై మక్కువ చూపేవాడనీ, అదే అతడిని నృత్య దర్శకుడిని చేసింది. ఐతే దురదృష్టవశాత్తూ భూకంపం ధాటికి ప్రమాదానికి లోనై ఆయన మరణించడం కుటుంబ సభ్యులను తీరని శోకంలో నింపింది. కాగా విజయ్ భౌతిక కాయాన్ని నేపాల్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments