Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి అభ్యర్థిగా మహాత్మా గాంధీ మనవడు... ప్రధాని మోడీ సమ్మతించేనా?

భారత రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మరో కొత్తపేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరన్నదానిపై వివిధ రకాలుగా చర్చ సాగుతోంది. అదేసమయంలో బీజేపీ సారథ

Webdunia
గురువారం, 11 మే 2017 (09:41 IST)
భారత రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మరో కొత్తపేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరన్నదానిపై వివిధ రకాలుగా చర్చ సాగుతోంది. అదేసమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి లేదా కాంగ్రెస నాయకత్వంలోని యూపీఏలు ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేక పోతున్నాయి. 
 
ఇప్పటికే ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చినా కాసేపటికే మాయం అవుతున్నాయి. తాజాగా మహాత్మాగాంధీ మనవడు, గతంలో దౌత్యవేత్తగా, గవర్నర్‌గా సేవలందించిన గోపాలకృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనను దింపాలని యోచిస్తున్న ప్రతిపక్ష నేతలు గోపాలకృష్ణ‌తో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయనను కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అయితే ఈ విషయంలో ఇంతకుమించి పురోగతి లేదని, చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఊహాగానాలు వద్దని సూచించారు. కాగా, గోపాలకృష్ణ గాంధీ, లేకుంటే లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌‌లను బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా గాంధీవైపే మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments