Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ విద్యావిధానం 2020- భారత్‌లో ఉన్నత విద్యా సంస్థల కోసం నూతన సృష్టి

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (17:31 IST)
మహమ్మారి అనిశ్చితిల నడుమ జాతీయ విద్యావిధానం 2020 యొక్క ఆమోదం, సమాజానికి అర్థవంతమైన మార్పును తీసుకురావాలనే రాజకీయ వ్యవస్థల నిబద్ధతను ప్రదర్శిస్తుంది. విద్యామంత్రిత్వ శాఖకు చెందిన పలువురు మంత్రులు, అధికారులు, నిపుణులు మరియు ఇతర మంత్రిత్వశాఖలు అయినటువంటి స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ, యువత మరియు క్రీడలు, సాంస్కృతిక శాఖ తదితరాల ప్రయత్నాల ప్రతిరూపం ఎన్‌ఈపీ2020.

అంతర్జాతీయంగా అత్యున్నత ప్రక్రియలను స్వీకరించడం, భవిష్యత్‌ ధోరణులు, ప్రాధమిక స్థాయి వద్ద ఉన్న భావోద్వేగాలను ఒడిసిపట్టడం మరియు భారత్‌ మరియు భారతీయ స్ఫూర్తిని వృద్ధి చేయడంపై ఈ విధానం దృష్టి పెట్టింది. ఈ రచయిత అనుభవపూర్వక ప్రపంచ దృక్పథంలో, భారతీయత అంటే క్లుప్తంగా ‘త్రికరణ శుద్ధి’(ఆలోచన- మాట-చర్య (టీడబ్ల్యుఏ) మధ్య సంపూర్ణ సామరస్యం)తో స్వీయ మరియు తన చుట్టుపక్కల వారి సంతోషం కోసం ఏదైనా చేయడం.
 
ఇండియా మరియు భారత్‌ నడుమ వైవిధ్యత పట్ల ఈ విధానంలో స్పష్టమైన అవగాహన ఉంది. ‘‘ఈ జాతీయ విద్యావిధానంలో భారతీయ నైతికతలో పాతుకుపోయిన విద్యావ్యవస్థకు మార్గనిర్దేశనం చేస్తుంది. ఇది నేరుగా ఇండియాను మార్చడానికి దోహదం చేస్తుంది. అదే భారత్‌. అందరికీ అత్యంత నాణ్యమైన విద్యను అందించడం ద్వారా సమానమైన మరియు శక్తివంతమైన జ్ఞానం కలిగిన సమాజంలో  స్థిరత్వాన్ని తీసుకురావడం, తద్వారా ఇండియాను అంతర్జాతీయంగా, విజ్ఞాన పరంగా సూపర్‌పవర్‌గా మార్చడం లక్ష్యంగా చేసుకుంది’’. 
 
అంతర్జాతీయ పౌరసత్వం అనే భావనకు తోడ్పాటునందించడంతో పాటుగా అది ధృవీకరించబడింది. ‘‘ ఈ విధానం యొక్క లక్ష్యం, అభ్యాసకుల నడుమ భారతీయుడిననే గర్వం అంతర్లీనంగా కల్పించడం, అది ఆలోచనలపరంగా మాత్రమే కాదు, స్ఫూర్తి, తెలివితేటలు మరియు చేసే పనులు, అలాగే జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, వైఖరిలను అభివృద్ధి చేయడంతో పాటుగా మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధి మరియు జీవితం, అంతర్జాతీయ సంక్షేమంలో సైతం అది ప్రతిబింబించేలా చేయడం తద్వారా అసలైన అంతర్జాతీయ పౌరునిగా ప్రతిబింబించడం’’.
 
జాతీయ విద్యావిధానం యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం
అ) విద్యార్థులకు తగిన శక్తినందించడం
ఆ) జవాబుదారీతనం మరియు స్వయ ప్రతిపత్తికి ప్రాధాన్యత ఇవ్వడం
ఇ) విద్యాసంస్థల పనితీరులో చురుకుదనం ప్రోత్సహించడం.
ఉపాధ్యాయులు, భాషలు, విలువలతో కూడిన విద్యపై దృష్టి కేంద్రీకరించడమనేవి భారత్‌ యొక్క స్ఫూర్తి అనగా భారతీయత ఎలా పొందాలో తెలిపేందుకు కొన్ని ఉదాహరణలుగా నిలుస్తాయి.
 
ఈ విధాన అమలులో, రాష్ట్రాలు మరియు విశ్వవిద్యాలయాలు ఈ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
1) తమ పరిధిలో ఉన్నటువంటి ఉప వ్యవస్ధలు మరియు వ్యక్తిగత సంస్ధల యొక్క విజయాన్ని గరిష్టంగా పెంచడం
2) వ్యవస్థ యొక్క శ్రేష్టతకు ఎదురయ్యే అవరోధాలను రద్దు చేయడానికి ప్రాధాన్యతనివ్వడం చేయాలి.
 
విద్యావేత్తలు, అడ్మిన్‌స్ట్రేటర్లు, లీడర్లుతో కూడిన ఉన్నత విద్యా సమాజంలో ఈ విధానం అత్యవసరంగా అమలుచేయాల్సినంతగా ఏమి కలిగి ఉంది?
 
మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి గౌరవం, హోదా, లక్షణంను ఈ పాలసీ తీసుకురావాలని కోరుకుంటుంది. అదే సమయంలో జాతి నిర్మాణంలో వారి పాత్రనూ గుర్తిస్తుంది. ఆవిష్కరణల ఆధారిత అంతర్గతీకరణ మరియు సంస్థల బాహ్యీకరణ తెరువడం చాలా అవసరం, ఎందుకంటే ఇది ఇనిస్టిట్యూషన్‌ లోపల బోధన మరియు అభ్యాసకుల సమాజంతో ఇనిస్టిట్యూషన్‌ (విద్యావేత్తలు) మరియు పరిశ్రమ(ప్రొఫెషనల్స్‌) మధ్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరస్పర సంభాషణలను పెంచుతుంది.
 
సాంకేతిక కేంద్రీకృత విధానం ద్వారా ఇనిస్టిట్యూషన్‌ యొక్క వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడమనేది ఇనిస్టిట్యూషన్‌ల మనుగడ, విజయానికి అత్యంత కీలకం.  పరస్పర ప్రయోజనకరమైన పరిశ్రమ- ఇనిస్టిట్యూట్‌ ఇంటరాక్టివిటీ మా సంస్థల వృద్ధికి తోడ్పడుతుంది. ఇనిస్టిట్యూషన్‌ అలాగే సమాజం యొక్క పాత్ర మన ఇనిస్టిట్యూషన్‌లలో వ్యూహాత్మక ప్రాధాన్యతగా పునరుద్ధరించిన ప్రధాన స్రవంతికి అర్హమైనది.

ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశమేమిటంటే, ‘సమీప పొరుగు, ప్రాంతం దేశంకు మన ఇనిస్టిట్యూషన్‌ అందిస్తున్న అదనపు మరియు వృద్ధి చెందిన విలువ ఏమిటి?’అని. అది బోధనకు మాత్రమే పరిమితమైన ఇనిస్టిట్యూషన్‌ లేదా పరిశోధనా ఆధారిత ఇనిస్టిట్యూషన్‌, బహుళ అంశాలను బోధించే భారీ యూనివర్శిటీ లేదా స్వతంత్య్ర కళాశాల అయినా, ఇనిస్టిట్యూషన్‌ల ఆకృతులను సామాజికంగా పెంచడానికి మార్గాలు ఉన్నాయి.
 
- డాక్టర్‌ ఆర్‌ పీ రాయ, ఉపాధ్యక్షులు- భారతీయ శిక్షణ్‌ మండల్‌ (బీఎస్‌ఎం) మరియు ప్రొఫెసర్‌ (రిటైర్డ్‌)- పాండిశ్చేరీ యూనివర్శిటీ(profraya.in)
 
(పైన పేర్కొన్న అభిప్రాయాలు, ఆలోచనలు రచయిత వ్యక్తిగతం మరియు రచయిత సంస్థకు చెందిన అభిప్రాయాలుగా వాటిని పరిగణించాల్సిన అవసరం లేదు)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాట్నా వేదికగా "పుష్ప-2" ప్రమోషన్ ఈవెంట్?

నా బరువు గురించి మీకెందుకయ్యా... నెటిజన్‌పై సమంత ఫైర్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments