Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూమ్ బర్గ్ అత్యంత ప్రభావశీలుర జాబితాలో నరేంద్ర మోడీ

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (09:34 IST)
ఇటీవలి విదేశీ పర్యటనల్లో  ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షించిన ప్రధాన మంత్రుల జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చోటు దక్కింది. తద్వారా మోడీ అరుదైన ఘనత సాధించినట్లైంది. బ్లూమ్ బర్గ్ అత్యంత ప్రభావశీలుర జాబితాలో తొలి 50 మందిలో నరేంద్ర మోడీ చోటు దక్కించుకున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జానెట్ ఎలెన్ అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలో భారత ప్రధానికి చోటు దక్కడం ఇదే తొలిసారి. గతేడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యలిద్దరూ ఈ ఏడాది జాబితాలో స్థానం కోల్పోయారు.
 
రాజకీయ నేతలు, ఆర్థిక వేత్తలు, బ్యాంకర్లు, కార్పొరేట్ దిగ్గజాలు తదితరులో కూడుకున్న ఈ జాబితాలో రాజకీయ నేతలకు సంబంధించి మరో ముగ్గురు మాత్రమే మోడీ కంటే ఎగువన ఉన్నారు. వారిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జర్మనీ చాన్సెలర్ ఎంజెలా మెర్కెల్, చైనా ప్రధాని జీ జిన్ పింగ్‌లు ఉన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన మోడీ, 30 ఏళ్ల తర్వాత భారత్‌లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగారని ‘బ్లూమ్ బర్గ్’ పేర్కొంది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments