Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ఎన్డీయే పాలనకు మూడేళ్లు.. గుర్తుగా దేశంలో అతిపెద్ద వంతెన ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చి శుక్రవారంతో మూడేళ్లు. దీనికి గుర్తుగా ప్రధాని మోడీ అతిపెద్ద వంతెనను ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద తొలి వంతెన కావడం గమనార్హం

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (11:04 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చి శుక్రవారంతో మూడేళ్లు. దీనికి గుర్తుగా ప్రధాని మోడీ అతిపెద్ద వంతెనను ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద తొలి వంతెన కావడం గమనార్హం. మొత్తం 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. అస్సాంలోని సాదియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ధోలా‌లను ఈ సేతువు కలుపుతుంది. 
 
ముంబైలోని బాంద్రా-వోర్లి సీ లింక్ బ్రిడ్జి కంటే ఇది 3.55 కిలోమీటర్ల పొడవైనది. సాదియా-ధోలా బ్రిడ్జి ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 6 గంటల ప్రయాణ దూరాన్ని కేవలం గంటకు తగ్గించనుంది. అలాగే 60 టన్నుల యుద్ధ ట్యాంకును కూడా దీనిపై నుంచి తరలించేంత దృఢంగా దీనిని నిర్మించారు.
 
ఇకపోతే.. చైనో-ఇండియా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో యుద్ధ సమయంలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సైన్యానికి వేగంగా చేరవేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్, అసోం ప్రజలు ఎయిర్‌పోర్టు, రైలు మార్గాలను వేగంగా చేరుకునే వెసులుబాటును ఈ బ్రిడ్జి కల్పిస్తోంది. 
 
వంతెన నిర్మాణం 2011లో ప్రారంభమైంది. ఈ వంతెన నిర్మాణం కోసం రూ.950 కోట్లను ఖర్చు చేశారు. అసోం రాజధాని దీస్ పూర్‌కు 540 కిలోమీటర్లు, అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపే ఉంది. దీంతో డ్రాగన్ కంటీ ఇటువైపు ఓ కన్నేసి ఉంచింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments