Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిని అడ్డుకున్న ప్రియుడు.. చంపేందుకు పడక సుఖం ఆఫర్ చేసిన ప్రియురాలు..

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (08:23 IST)
తనకు వివాహం కాకుండా అడ్డుపడుతున్నాడని భావించిన ఓ యువతి.. ప్రియుడును చంపేందుకు ప్లాన్ వేసింది. ఇందుకోసం హంతకుడికి వైన్ బాటిల్‌తో పాటు.. ఓ రాత్రి పడక సుఖం ఆఫర్ చేసింది. చివరకు ఈ ప్లాన్ విఫలం కావడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
తన పెళ్లికి అడ్డుపడుతున్న ప్రియుడిని హతమార్చేందుకు ఏ యువతి ఇవ్వని ఆఫర్ ను సుపారీగా ప్రకటించి, తన లక్ష్యం సాధించి, ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాల వెనక కాలం గడుపుతోంది. తాను చెప్పినట్టు చేస్తే, రూ. 1.50 లక్షల డబ్బుతో పాటు, ఓ రాత్రి ఏకాంతంగా గడుపుతానని ఆమె ఇచ్చిన ఆఫర్ అతనికి నచ్చడంతో, వెంటనే పని పూర్తి చేసేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే...
 
మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన చందూ మహాపూర్ అనే వ్యక్తి ఓ విహాహితుడు. ఈయన అదే ప్రాంతానికి చెందిన మరో 20 యేళ్ళ అవివాహిత యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 
 
అయితే, ఆమెకు ఇటీవల మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లిని ఇష్టపడని చందూ, పెళ్లి చేసుకోవద్దంటూ ఒత్తిడి తెస్తుండటంతో ఆ యువతి తీవ్ర ఆగ్రహంతో అతన్ని చంపించాలని నిర్ణయించుకుంది.
 
చందూకు దూరపు బంధువు, ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలున్న భరత్ గుర్జార్‌ను కలిసి తన ఆఫర్ చెప్పింది. తాను చెప్పినట్టు చేస్తే, రూ.1.50 లక్షల డబ్బుతో పాటు, ఓ రాత్రి ఏకాంతంగా గడుపుతానని ఆమె ఆఫర్ ఇచ్చింది. 
 
ఇది అతనికి నచ్చడంతో, మరో ఆలోచన లేకుండా చందూను మద్యం సేవించడానికి పిలిచి, నిర్మానుష్య ప్రాంతంలో తల పగులగొట్టి హత్య చేశాడు. ఈ ఘటన 25వ తేదీ గురువారం జరిగింది. ఆపై మృతదేహాన్ని ఓ క్రషర్ మైన్ వద్ద పడేయగా, గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
ఆ వెంటనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, చందూను తీసుకెళ్లింది గుర్జార్ అని నిర్దారణకు వచ్చారు. ఆ వెంటనే గుర్జార్‌ను, అతనికి ఆఫర్ ఇచ్చిన యువతిని, ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, గుర్జార్‌కు అందాల్సిన ఒక రాత్రి ప్రతిఫలం దక్కకముందే విషయం మొత్తం బట్టబయలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం