Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీఫ్ జస్టిస్ తల్లిని మోసం చేసిన ఫ్యామిలీ కేర్‌టేకర్!

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (15:32 IST)
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్ఏ బాబ్డే విధులు నిర్వహిస్తున్నారు. ఈయన తల్లి ముక్తా బాబ్డే. ఈమెను ఓ కేర్‌టేకర్ మోసం చేశాడు. అదీ కూడా 2.5 కోట్ల రూపాయలుకు టోకరా వేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఆకాశవాణి కేంద్రం సమీపంలో బోబ్డే కుటుంబానికి ఒక పంక్షన్‌ హాల్‌ ఉంది. అది ముక్తా బోబ్డే పేరు మీద ఉంది. దానికి పదేళ్లుగా తపస్ ఘోష్ (47) అనే వ్యక్తి కేర్‌టేకర్‌గా వ్యవహరిస్తున్నాడు.
 
దానికి వచ్చే అద్దెను ఆయన బోబ్డే కుటుంబానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. అయితే, ముక్తా బోబ్డే వృద్ధాప్యం, ఆమె అనారోగ్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ఆమెకు అతడు తప్పుడు లెక్కలు చెబుతూ ఏళ్ల తరబడి డబ్బులు కాజేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఫంక్షన్ హాల్‌కు భారీగా బుకింగ్‌లు వచ్చి, లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.
 
దీంతో, డబ్బులు చెల్లించిన వారికి తిరిగి ఇవ్వడంలో తపస్ ఘోష్ జాప్యం చేశాడు. ఈయన చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించిన ముక్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఘోష్‌ను అరెస్టు చేశారు. ఈ నెల 16 వరకు రిమాండ్‌కు తరలించారు. సీజేఐ బోబ్డే తల్లిని ఫ్యామిలీ కేర్ టేకర్‌ మోసం చేశాడన్న కేసులో విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments