Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతిపై విచారణ చేసుకోమను... నాకేంటి భయం : శశికళ

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం అనేక కొత్త విషయాలను బయటపెడుతోంది. జయలలిత మృతికి సంబంధించి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ.పన్నీరు సెల్వం జయ మృతిపై అనుమానాల

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:32 IST)
తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం అనేక కొత్త విషయాలను బయటపెడుతోంది. జయలలిత మృతికి సంబంధించి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ.పన్నీరు సెల్వం జయ మృతిపై అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. 
 
పైగా, అమ్మ మృతికి సంబంధించి నెలకొన్న అనుమానాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని పన్నీరు సెల్వం ప్రకటించారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలిసేందుకు ప్రయత్నించానని, కానీ శశికళ కలవనీయలేదని పన్నీరు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పెద్ద దుమారాన్నే రేపాయి. 
 
ఈ వ్యాఖ్యలపై శశికళ స్పందించారు. పన్నీర్ చేసినవన్నీ ఆరోపణలేనని కొట్టిపారేశారు. జయలలిత మృతికి సంబంధించి విచారణ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంలో తాను భయపడాల్సిన పని లేదన్నారు. తన మీద వస్తున్న సందేహాలను ఆమె ఖండించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో సోదరిలా చూసుకున్నానని, ఆ విషయం తనకు తెలుసని శశికళ చెప్పారు. 
 
తనను ఎలా చూసుకున్నానో జయలలితకు బాగా తెలుసని ఆమె తెలిపారు. జయలలితను సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నానని, ఆ విషయం ఆసుపత్రి సిబ్బందిని అడిగితే వివరంగా చెబుతారని శశికళ చెప్పారు. విచారణకు తాను భయపడాల్సిన పనిలేదని శశికళ తేల్చి చెప్పారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments