Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చలేదు.. సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడు : ఇన్ఫోసిస్‌ టెక్కీ తండ్రి రాజు

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చక పోవడంతో సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడని పూణెలో హత్యకు గురైన ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి రాజు ఆరోపించారు. నిజానికి ఆదివారం కార్యాలయం సెలవు అయినప్పటికీ.. నా కుమార్తెను మాత్

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:09 IST)
సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చక పోవడంతో సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడని పూణెలో హత్యకు గురైన ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి రాజు ఆరోపించారు. నిజానికి ఆదివారం కార్యాలయం సెలవు అయినప్పటికీ.. నా కుమార్తెను మాత్రం ఒంటరిగా కార్యాలయానికి పిలిపించి, హత్య చేయించారని టెక్కీ తండ్రి మాజీ ఆర్మీ అధికారి రాజు ఆరోపించాడు. పూణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో రశీల రాజు అనే 23 యేళ్ల టెక్కీని సెక్యూరిటీ గార్డు విద్యుత్ వైర్లతో మెడకు ఉరి బిగించి హత్య చేసిన విషయం తెల్సిందే. 
 
దీనిపై మృతురాలి తండ్రి మాట్లాడుతూ తమ కుమార్తె రశీల రాజు (23) పూణేలోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోందని, అయితే... ఆమె కార్యాలయంలోనే పనిచేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగి తరచూ వెంటపడి తన కుమార్తెను వేధించేవాడన్నారు. అతనికి లొంగకపోవడంతో తన కుమార్తెను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడన్నారు. ఆరోజు ఆదివారం అయినప్పటికీ రశీలకు ఫోన్ చేసి ఆఫీస్‌కు రావాలని చెప్పడంతో కార్యాలయానికి వచ్చిన ఆమెను సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించారన్నారు.
 
కాగా... రాజీవ్‌గాంధీ ఇన్ఫోటెక్‌ పార్క్‌లో ఉన్న ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం పనిచేయడానికి వెళ్లిన రశీలను సాయంత్రం 9వ అంతస్తులో సెక్యూరిటీ గార్డు సాయికియా హత్య చేయడం తెలిసిందే. అస్సాం రాష్ట్రానికి చెందిన సెక్యూరిటీ గార్డు సామాన్లు సర్ధుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా, రశీల మృతికి నష్టపరిహారంగా రూ.కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఆమె కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఇన్ఫోసిస్‌ సంస్థ ఒప్పుకున్నట్లు అంగీకరించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments