Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డ్రగ్స్‌కు బానిసనయ్యా.. బతకాలని లేదు'.. 19వ అంతస్థు నుంచి దూకిన విద్యార్థి (Video)

ముంబైలో దారుణం జరిగింది. డ్రగ్స్‌కు బానిస అయిన ఓ విద్యార్థి ముంబైలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌ని 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆ విద్యార్థి సిగరెట్ తాగుత

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (15:36 IST)
ముంబైలో దారుణం జరిగింది. డ్రగ్స్‌కు బానిస అయిన ఓ విద్యార్థి ముంబైలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌ని 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆ విద్యార్థి సిగరెట్ తాగుతూ, మద్యం సేవిస్తూ తన మనసులోని బాధను వెళ్లగక్కాడు. అంతేనా, ఈ ఆత్మహత్య ఘటన మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన అర్జున్‌ భరద్వాజ్‌ అనే విద్యార్థి మహారాష్ట్రలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్యాభ్యాసం చేస్తున్నాడు. అర్జున్‌ సోమవారం బంద్రా శివారులోని ఓ ప్రముఖ హోటల్‌కి వెళ్లి.. 19వ అంతస్తులో గది తీసుకున్నాడు. సాయంత్రం వరకు హోటల్‌ సూట్‌లోనే ఉన్న అర్జున్‌.. సోమవారం రాత్రి తన గది కిటికీ నుంచి దూకి.. ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఒక్కసారిగా పెద్ద శబ్దాన్ని విన్న హోటల్‌ సిబ్బంది వెళ్లి చూసేసరికి అర్జున్‌ రక్తపు మడుగులో కనిపించాడు. వారు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. చనిపోవడానికి ముందు అర్జున్‌ సోషల్‌మీడియాలో ఆత్మహత్య చేసుకోవడం ఎలా అనే ఓ వీడియో పోస్టు చేశాడు. 
 
హోటల్‌ గదిలో సూసైడ్‌ నోట్‌ను కూడా గుర్తించినట్లు చెప్పారు. ‘నేను మాదకద్రవ్యాలకు బానిసయ్యాను. ఇక నాకు బతకాలని లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని అర్జున్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. హోటల్‌లో ఇచ్చిన వివరాల ఆధారంగా అర్జున్‌ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments