Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని చూసేందుకు ఇంటికొచ్చిన టెక్కీ.. తలుపు తీయగానే షాక్...

కోటి ఆశలతో కన్నతల్లిని చూసేందుకు వచ్చిన కన్నబిడ్డకు తలుపు తీయగానే ఇంటిలో కనిపించిన దృశ్యం చూసి షాక్‌కు గురయ్యాడు. తాను పడిన కష్టమంతా వృధా అనుకున్నాడు. తన భవిష్యత్ ఇక శూన్యంగా మారిపోయిందనుకున్నాడు. ఇంత

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (13:23 IST)
కోటి ఆశలతో కన్నతల్లిని చూసేందుకు వచ్చిన కన్నబిడ్డకు తలుపు తీయగానే ఇంటిలో కనిపించిన దృశ్యం చూసి షాక్‌కు గురయ్యాడు. తాను పడిన కష్టమంతా వృధా అనుకున్నాడు. తన భవిష్యత్ ఇక శూన్యంగా మారిపోయిందనుకున్నాడు. ఇంతకు ఇంట్లో ఎలాంటి దృశ్యం కనిపించిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఉన్న లోఖంద్వాల కాంప్లెక్స్‌ ఆశా సహానీ (63) అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త మరణించాడు. ఈ దంపతులకు రితురాజ్ అనే కుమారుడు ఉండగా, ఈయన ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లాడు. 
 
ఈనేపథ్యంలో, తన తల్లిని చూసేందుకు రితురాజ్ అమెరికా నుంచి ముంబై వచ్చాడు. ఎంత సేపు బెల్ కొట్టినా తన తల్లి తలుపు తీయలేదు. దీంతో, డూప్లికేట్ తాళాలు తయారు చేసే వ్యక్తి సాయంతో ఆయన తలుపు తీయించి, ఇంట్లోకి వెళ్లారు. అంతే, ఒక్క సారిగా ఆయన షాక్ కు గురయ్యారు. కుళ్లిపోయిన శవం రూపంలో తన తల్లి కనిపించింది. 
 
తల్లి శవాన్ని చూసిన రితురాజ్.. అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వారు రితురాజ్‌ను ఓదార్చారు. అనంతరం, ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ప్రమాదవశాత్తు ఆమె మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments