Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెదురు బొంగుతో బస్సు గేర్.. స్కూలు బస్సు డ్రైవర్ సాహసం..

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (16:22 IST)
స్కూల్ బస్సులు మంచి కండిషన్‌లో ఉండాలని ఆయా రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు పదేపదే హెచ్చరిస్తుంటారు. పైగా, ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో స్కూలు బస్సులను ఆర్టీఏ అధికారులు నిశితంగా తనిఖీ చేస్తుంటారు. అయినప్పటికీ.. స్కూలు బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా స్కూలు బస్సుల డ్రైవర్ల తీరు మారడం లేదు. బస్సును పరిశుభ్రంతో పాటు మంచి రన్నింగ్ కండిషన్‌లో ఉంచుకోవాల్సిన డ్రైవర్లు తమ విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలితంగా స్కూలు పిల్లల ప్రాణాలు గాల్లో దీపంలా తయారయ్యాయి. 
 
తాజాగా ముంబైలో ఓ స్కూలు బస్సు డ్రైవర్ విరిగిన ఇనుప రాడ్ స్థానంలో వెదురు బొంగుతో గేర్‌ తయారు చేశాడు. ఈ వెదురు బొంగుతోనే బస్సును మూడు రోజుల పాటు నడిపాడు. ఈ విషయం బయటకు రావడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసారు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైలోని ఖార్ వెస్ట్ ప్రాంతంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారుని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. కారును ఢీకొట్టిన తర్వాత బస్సు డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, కారు డ్రైవర్ అతన్ని వదిలిపెట్టలేదు. కారుతో వెంటాడి మరీ అతడిని పట్టుకున్నాడు. జరిగిన ఘటనపై నిలదీసి వాగ్వాదానికి దిగాడు. 
 
ఆ క్రమంలో బస్సు గేర్ లివర్ స్థానంలో వెదురు బొంగు కనిపించింది. ఫిట్నెస్‌ లేని బస్సు వల్లే ప్రమాదం జరిగిందని గ్రహించి.. డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్ డ్రైవర్ రాజ్‌కుమార్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే, బస్సును కూడా సీజ్ చేశారు. 
 
పోలీసుల విచారణలో డ్రైవర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. విరిగిపోయిన గేర్ లివర్ స్థానంలో కొత్త దాన్ని వేయించేందుకు తనకు సమయం దొరకలేదని.. అందుకే తాత్కాలికంగా వెదురుబొంగుతో నడిపిస్తున్నానని చెప్పాడు. మూడు రోజులుగా అదే వెదురుబొంగుతో స్కూల్ బస్సును నడుపుతున్నట్లు తెలిపాడు. అదే బస్సులో విద్యార్థులను చేరవేస్తున్నానని అంగీకరించాడు. 
 
కాగా, ఘటనపై స్కూల్ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని... తల్లిదండ్రులు ఆందోళనలు చెందవద్దని సూచించారు. వెదురుబొంగుతో బస్సును నడుపుతున్న విషయం తమకు తెలియదని తెలిపారు. కేసు విచారణకు సహకరిస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments