Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూ లైన్‌ బ్రేక్ చేసిందని మహిళను చావబాదిన ముంబై పోలీసులు.. ముంబైలో ఖాకీల రాక్షసత్వం

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2015 (16:52 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగర పోలీసులు మరోమారు తమ దురుసుతనాన్ని ప్రదర్శించారు. వినాయక దర్శనం కోసం వచ్చిన ఓ యువతి క్యూ లైన్‌ను బ్రేక్ చేసిందన్న అక్కసుతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు చావబాదారు. ఆ తర్వాత బయటకు ఈడ్చిపారేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే గణపతి విసర్జన్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి సాధారణ క్యూ లైన్‌లో కాకుండా, వీఐపీ గేటులో వచ్చింది. దీన్ని గమనించిన ఓ మహిళా కానిస్టేబుల్ తొలుత ఆ మహిళను అడ్డుకుంది. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇంతలో ఇంకో వైపు నుంచి వచ్చి మరో మహిళా కానిస్టేబుల్ ఆ మహిళ చెంప చెళ్ళుమనిపించింది. 
 
ఆ తర్వాత ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కలిసి ఆ మహిళను చావబాదారు. ఈ తంతంగాన్నంతా కొందరు వ్యక్తులు వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ విస్తరించి కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. గణేశ్ నిమజ్జనం సమయంలో సున్నితంగా వ్యవహరించాల్సిన పోలీసులు రౌడీల్లా వ్యవహరించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమౌతున్నాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments