Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో నివసించడం సురక్షితం కాదు : మాజీ సీఎం సతీమణి ట్వీట్ (video)

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (09:13 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జీవించడం ఏమాత్రం సురక్షితం కాదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఓ ట్వీట్ చేశారు.
 
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా, ముంబై పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై పలు ఆలోచనలకు దారితీస్తోంది. 
 
ముంబై పోలీసులు కేసుని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నార‌ని కొంద‌రు ఆరోపిస్తున్న నేప‌థ్య‌లో బీహార్ పోలీసులు దీనిపై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ విచారించాల‌ని మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ తెలిపారు. 
 
ఈ పరిస్థితుల్లో ఫడ్నవిస్ భార్య శ్రీమతి అమృత ముంబై పోలీసుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచార‌ణ చూస్తుంటే.. ముంబైలో మాన‌వ‌త్వం చ‌చ్చిపోయిందేమో అనిపిస్తుంది. అమాయ‌కం, సెల్ఫ్‌రెస్పెక్ట్ ప్ర‌జ‌ల‌కి ఇక్క‌డ ఉండ‌డం సుర‌క్షితం కూడా కాదు అని నా భావ‌న‌ అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments