Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్‌మేట్‌ను జైల్లో పెట్టించిన రైల్వే మంత్రి

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (10:08 IST)
కేంద్ర మంత్రుల్లో మచ్చలేని వారిలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఒకరు. ఈయన తాజాగా తన క్లాస్‌మేట్‌ను జైల్లో పెట్టించారు. తన క్లాస్‌మేట్ ఓ మోసగాడని తెలిసి అతనిపై కేసు పెట్టించిమరీ అరెస్టు చేయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరానికి చెందిన మాటుంగ ప్రాంత వ్యక్తి, జ్యోతి కుమార్ అగర్వాల్ (50) అనే వ్యక్తి పియూష్ గోయల్ స్కూల్‌మేట్. చిన్నప్పుడు వారిద్దరూ కలిసి చదువుకున్నారు. గత యేడాది సెప్టెంబరు నెలలో తన స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం జరుగగా, పియూష్ గోయల్ హాజరయ్యారు. అపుడు జ్యోతి కుమార్ తనను తాను పరిచయం చేసుకుని ఫోటోలు దిగాడు. 
 
ఆ తర్వాత ఆ ఫోటోలు చూపిస్తూ పలువురుని మోసం చేయసాగాడు. మనీష్ చగన్ లాల్ అనే వ్యక్తికి వాటిని చూపించి, పియూష్‌తో మాట్లాడి, రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. పియూష్‌కు దీపావళి కానుకను పంపుదామని చెప్పి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. 
 
ఆపై కాంట్రాక్ట్ మాటెత్తకపోవడంతో, తనకున్న పరిచయాలతో పియూష్‌ను మనీష్ సంప్రదించి, జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు. దీంతో జ్యోతికుమార్ మోసగాడని, కేసు పెట్టి అరెస్ట్ చేయాలని పియూష్ స్వయంగా ముంబై పోలీసులను ఆదేశించారు. దీంతో కదిలిన పోలీసులు, జ్యోతికుమార్ అగర్వాల్‌పై కేసు పెట్టి అరెస్టు చేయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments