Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్ ఫ్రెండ్సే రేపిస్ట్‌లు... అమ్మాయిలూ జాగ్రత్త...! కమిషనర్ అలెర్ట్..

Webdunia
శనివారం, 29 నవంబరు 2014 (11:32 IST)
నిజంగా బాయ్ ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలకి చాలా విశ్వాసం. ఐతే ఆ నమ్మకం చాలా దారుణంగా వమ్మవుతోందని తాజాగా విడుదలైన గణాంకాలు తెలుపుతున్నాయి. ముంబై మహా నగరంలో బాయ్ ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురవుతున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతోందని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా లెక్కలతో సహా చూపిస్తూ చెప్పారు. 
 
ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ... మంచి మాటలతో అమ్మాయిలను నమ్మించి, వారిని లొంగదీసుకుని, అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడి, చివరికి తమకేమీ తెలియనట్టు చేతులు దులుముకునే మోసగాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. కనుక అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌తో జర జాగ్రతగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
 
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు 542 అత్యాచార ఘటనలు చోటు చేసుకోగా, వాటిలో 389 కేసులు బాయ్ఫ్రెండ్ చేతిలోనే యువతులు అత్యాచారానికి గురైయ్యారని చెప్పారు. బాయ్ఫ్రెండ్లు చెప్పే మాయ మాటలను యువతలు వెంటనే నమ్మడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాకేశ్ మారియా విశ్లేషించారు. 
 
కాగా మరో ఆరు శాతం మంది యువతులు ఆగంతకుల చేతిలో అత్యాచారానికి గురైయ్యారని తెలిపారు. మిగిలిన యువతులు మాత్రం బంధువులు లేక పరిచయస్థుల చేతిలో అత్యాచారానికి గురైనవారని ఆయన చెప్పారు. అయితే మొత్తం 542 అత్యాచార కేసుల్లో ఇప్పటివరకు 477 కేసులను ఛేదించినట్లు  రాకేశ్ మారియా వివరించారు.

నర్మదా ఘాట్, నెమావార్ మైదానంలో అశ్వత్థామ నడిచే చోట కల్కి 2898 ADలో అమితాబ్

అందుకే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని యోదా డయాగ్నొస్టిక్ తో అనుసంధానం చేశా :మెగాస్టార్ చిరంజీవి

మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్: డైరెక్టర్ అజయ్ భూపతి

'ప్రతినిధి 2'లో గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి: డైరెక్టర్ మూర్తి దేవగుప్తా

జిమ్‌లో సోనూసూద్‌కు కొత్త పార్ట్‌నర్

పురుషులు సోయాబీన్ అధికంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

ఈ హెర్బల్ జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

Show comments