Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

సెల్వి
శుక్రవారం, 21 మార్చి 2025 (20:43 IST)
Liquid Narcotics
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. బ్రెజిలియన్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో సాధారణ తనిఖీ సమయంలో నింపిన కండోమ్‌ల లోపల ఈ డ్రగ్ దొరికిందని వారు తెలిపారు.
 
ఒక విదేశీయుడు భారతదేశంలోకి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను తీసుకెళ్తున్నాడని అందిన సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డిఆర్ఐ సీనియర్ అధికారులు తెలిపారు.  "ఈ సమాచారం మాకు అందిన వెంటనే, మేము విమానాశ్రయంలో గస్తీని పెంచాము. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులందరినీ ప్రశ్నించడం ప్రారంభించాము" అని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అనుమానిత సూట్‌కేస్‌పై  శోధించాం. చివరికి లోపల ద్రవ కొకైన్‌ను కనుగొన్నామన్నారు.  
 
దీనిని స్వాధీనం చేసుకున్న అధికారులు అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాపై దర్యాప్తు చేస్తోంది. స్మగ్లింగ్ ఆపరేషన్ పెద్ద నెట్‌వర్క్‌లో భాగమా కాదా అని నిర్ధారించడానికి అధికారులు కృషి చేస్తున్నారని డీఆర్ఐ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం