Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై కేంద్రంగా 100 మంది యువతుల అక్రమ రవాణా: పెద్ద గ్యాంగ్ ఉందా?

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు వీడింది. ఏకంగా వందమంది యువతులను దేశ సరిహద్దులను దాటించారు. 14-16 ఏళ్లలోపు గల యువతులను ముంబై కేంద్రంగా ఈ మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు నగ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (16:30 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు వీడింది. ఏకంగా వందమంది యువతులను దేశ సరిహద్దులను దాటించారు. 14-16 ఏళ్లలోపు గల యువతులను ముంబై కేంద్రంగా ఈ మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు నగర క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.

గత మూడేళ్లుగా అమాయక యువతులకు మాయమాటలు చెప్పి ప్యారిస్ నగరానికి అక్రమంగా తరలిస్తున్నట్లు తేల్చారు. పిల్లలకు మంచి విద్య, తల్లిదండ్రుల స్థితిగతుల్లో మార్పులు చేస్తామంటూ నిందితులు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సునీల్ నంద్ వానీ, నర్సయ్య, ముంజలి అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. 
 
14 నుంచి 16ఏళ్ల లోపు మైనర్లను ఫ్రాన్స్‌కు తరలించి అక్కడే 18ఏళ్లు వచ్చే వరకూ ఉంచి.. ఆ తర్వాత ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేస్తారు ఈ నిందితులు. ఈ కేసులో అరిఫ్ ఫారూకీ అనే కెమెరామెన్, అసిస్టెంట్ కెమెరా మెన్ రాజేష్ షవార్, ఫాతేమా ఫరీధ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యువతులను అక్రమ రవాణా చేయడం వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments