Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపేయాలనుకుంటే కుమారుడి కంట్లో పడ్డాడు.. అంతే దూకేశాడు..

భార్య తనను మోసం చేస్తుందని.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త భార్యను హతమార్చేందుకు ప్రయత్నించాడు. అంతేగాకుండా.. భార్యను చంపేందుకు చేసిన ప్రయత్నాన్ని కుమారుడు కాస్త చూసేయడంతో ముంబైకి ఓ వ్

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (15:55 IST)
భార్య తనను మోసం చేస్తుందని.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త భార్యను హతమార్చేందుకు ప్రయత్నించాడు. అంతేగాకుండా.. భార్యను చంపేందుకు చేసిన ప్రయత్నాన్ని కుమారుడు కాస్త చూసేయడంతో ముంబైకి ఓ వ్యాపారవేత్త భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కొడుకు చూశాడనే భయంతో ఎనిమిదంతస్తుల మీద నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. వ్యాపారవేత్త భార్య మాత్రం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గతంలో తనను వేధింపులకు గురిచేస్తున్నాడనే చెప్పిన ఫిర్యాదుతో షిండే పోలీసులచే అరెస్టయ్యాడని తెలుస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కల్యాణ్‌ ప్రాంతంలో రాజేంద్ర షిండే(45), సంగీత(42) భార్యభర్తలు. వీరికి చేతన్‌ (19) అనే కుమారుడు, పదేళ్ల కూతురు ఉంది. వ్యాపార వేత్తగా పనిచేస్తున్న రాజేంద్ర షిండేకు భార్యపై అనుమానం ఎక్కువైంది. ప్రతిరోజూ దీనిపై గొడవపడుతూ ఉండేవాడు. అంతేగాకుండా భార్యను అనుమానంతో హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె కేకలు పెట్టడంతో చేతన్ వేగంగా పరిగెత్తుకొచ్చి తలుపులు కొట్టాడు. 
 
ఆదివారం మధ్యాహ్నం తన ప్లాన్‌ అమలు చేయాలనుకున్నాడు. కొడుకు చేతన్‌ బయటకు వెళ్లగానే భార్యపై కత్తితో దాడికి దిగాడు. కత్తిపోట్లకు ఆమె కేకలు పెట్టడంతో చేతన్ వేగంగా పరుగెత్తికొచ్చి తలుపుకొట్టాడు. డోర్ తలుపులు తెరవకపోవడంతో బాత్రూమ్ రూమ్ కిటికీలను పగులకొట్టి అందులో నుంచి లోపలికి వచ్చాడు. అది గమనించిన రాజేంద్ర షిండే భయంతో వేగంగా బాల్కనీ పైకెళ్లి అక్కడి నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం సంగీత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments