Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 లక్షలకు ఆశపడి.. రాజకీయ నేత భార్యకు స్టంట్ మాస్టర్ ఝలక్

బాలీవుడ్ టాప్ హీరోలు నటించిన అనేక చిత్రాల్లో స్టంట్ మాస్టర్‌గా పని చేశాడు అతను. పైగా అతనికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి పేరు కూడా ఉంది. అయితే, కేవలం రూ.2 లక్షలకు ఆశపడి జైలుపాలైన ఘటన ఒకటి తాజాగా వెలు

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (16:24 IST)
బాలీవుడ్ టాప్ హీరోలు నటించిన అనేక చిత్రాల్లో స్టంట్ మాస్టర్‌గా పని చేశాడు అతను. పైగా అతనికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి పేరు కూడా ఉంది. అయితే, కేవలం రూ.2 లక్షలకు ఆశపడి జైలుపాలైన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే శంషర్ ఖాన్(30) అనే వ్యక్తి బాలీవుడ్ చిత్రాల కోసం స్టంట్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన బాంబే కుర్ల ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈయనకు అభయ్ పాటిల్ (42) అనే కారు డీలర్‌కు, విజయ్ వర్మ అనే ఓ పని మనిషికి పరిచయం ఉంది. 
 
అదేసమయంలో ముంబైలోని వెయిన్ గంగా అనే అపార్ట్‌మెంట్లో పలువురు రాజకీయ నాయకులు, బిజినెస్ టైకూన్లు నివాసముంటున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లో నివశిస్తున్న రాజకీయ నేత భార్య అయిన అభా బాఫ్నాకు రూ.98 లక్షల విలువైన ఆడి ఏ 8(2008) కారు ఉంది. 
 
ఆ కారును ఎలాగైనా దొంగిలించి తనకు ఇవ్వాలని, అందుకు రూ.2 లక్షలు ఇస్తానని స్టంట్‌మెన్ అయిన శంషర్ ఖాన్‌కు అభయ్ పాటిల్ చెప్పాడు. దీంతో శంషర్ ఖాన్ పని మనిషి విజయ్ వర్మతో కలిసి కారు దొంగిలించేందుకు ప్లాన్ వేశారు. 
 
తమ ప్లాన్ సక్సెస్ కావడంతో కారును పాటిల్‌కు ఇచ్చేందుకు శంషర్ ఖాన్, విజయ్ వర్మలు కారులో నేవీ ముంబై రోడ్డుపై బయలుదేరాడు. అయితే, కారు చోరీకి గురైందన్న విషయం కొద్దిసేపటికే అభా బాఫ్నాకు తెలిసిపోయింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... రోడ్డుకు అడ్డంగా ఇనుప బారీ గేడ్స్ పెట్టి.. కారును అడ్డుకున్నారు. దీంతో కారును ఆపాల్సి వచ్చింది. వెంటనే పోలీసులు స్టంట్‌ మాస్టర్‌ను విజయ వర్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కారు చోరీకి గురైన కేవలం నాలుగు గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments